పదవ తరగతి ఫలితాలు అనుకున్న స్థాయిలో రాకపోవడం , దాదాపుగా రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ అవ్వడం, అలానే మార్కుల లిస్ట్ కూడా అవకతవకలతో నిండి ఉండటం చూసి, విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం నారా లోకేష్ జూమ్ అప్ ద్వారా చేసారు. కానీ ఇందులోకి వైసీపీ నాయకులూ కొడాలి నాని, వల్లభనేని వంశి హఠాత్తుగా ప్రత్యక్షమైనారు . దీనితో లోకేష్ లైవ్ ఆపేయడం జరిగింది. ఈ విషయం పై స్పందించిన అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... 20, 30 ఏళ్ల క్రితం పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి నాయకుల కోసం ప్రత్యేక జూమ్ కాన్ఫరెన్స్ త్వరలోనే నిర్వహించబడుతుంది. పరీక్ష పత్రాలు కొట్టేసిన జగన్ తో పాటు పరీక్ష తప్పిన వైసిపి నాయకులు అందరూ ఆహ్వానితులే. నేను స్వయంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, మీ అందరికీ నచ్చే విధంగా వైసిపి ప్రత్యేక భాషలోనే మాట్లాడతాను అని ఆయన అన్నారు.