రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారిని వెలుగులోకి తీసుకురావడానికి ‘జగనన్న స్పోర్ట్స్ క్లబ్’ల పేరిట క్రీడాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. క్రీడలపై అవగాహన పెంపొందించేలా సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి ప్రత్యేక జాబ్ చార్ట్‌ను కేటాయిస్తూ గురువారం మార్గదర్శకాలు (జీవోఆర్టీ నంబర్ 84, 85) విడుదల చేసింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా, ముఖ్యమైన తేదీల్లో స్థానికంగా పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. స్థానిక పాఠశాలలు, కళాశాలల్లోని పీడీ, పీఈటీలకు కో–ఆరి్డనేటర్లుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) పర్యవేక్షణలో ఈ స్పోర్ట్స్ క్లబ్‌లను నిర్వహించనున్నారు.