టీ20 ఫార్మాట్‌లో ఏడు నెలల అజేయంగా నిలిచిన టీమిండియా. వరుసగా 13వ విజయంతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలని ఆశించిన భారత్‌కు దక్షిణాఫ్రికా ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో సఫారీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ బౌలింగ్ చేయడంలో జట్టు విఫలమైందని తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు. రోహిత్ గైర్హాజరీతో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ చివరి నిమిషంలో వైదొలగడంతో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ తాత్కాలిక కెప్టెన్సీ నియనించారు. మ్యాచ్ అనంతరం ఓటమిపై పంత్ స్పందిస్తూ.. అనుకున్న రీతిలో బౌలింగ్ చేయలేకపోయినందుకు మూల్యం చెల్లించుకున్నాం అన్నారు.
‘మేం మంచి స్కోరు నమోదు చేశాం. కానీ ఆ తర్వాత మా ప్రణాళికలను సక్రమంగా అమలు చేయలేకపోయాం. అయితే ఒక్కోసారి ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లర్, వాన్ డెర్ డాజెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. నిజానికి మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితి మారిపోయింది. డేవిడ్ మిల్లర్‌ను కట్టడి చేసేందుకు మా వంతు కృషి చేశాం. కానీ వికెట్ బ్యాటింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. అయినప్పటికీ మా పనితీరుపై సంతృప్తిగా ఉన్నాం. అయితే తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా మెరుగ్గా రాణించాల్సి ఉంది' అని పంత్ అన్నాడు.