చిత్తూరు: పుత్తూరు మున్సిపాలిటీ పరిధి బైపాస్ రోడ్డు లోని మహాలక్ష్మి పురం వద్ద గురువారం రాత్రి 11. 40 రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఆనంబట్టు గ్రామానికి చెందిన రాజేష్ , తన ద్విచక్ర వాహనంపై తిరుపతి నుండి నగరి కి వెళుతుండగా ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడిన రాజేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు.