వ్యవసాయ పంపుసెట్లకు రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బి. దస్తగిరి రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మూలవంక విద్యుత్ సబ్ స్టేషన్ ముందు జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం రైతులకు నష్టం దాయకమన్నారు.