మండలంలో సవరసిద్దమణుగు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎగువ సవరసిద్దమణుగు గ్రామంలో వేసవి కాలం తాగునీటి కోసం గిరిజనులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఆ గిరిజన గూడల్లో పశు సంపద కూడా ఉంది. ఆ గ్రామానికి ఒకే బావి ఉండటం వల్ల గిరిజన ప్రజలు త్రాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. రెండు బోర్లు ఉన్నప్పటికీ కూడా కాలం చెల్లి వాటి పనిచేయకపోవడంతో నీరు చాలా లోతుగా వెళ్లిపోవడం వల్ల గృహ అవసరాలకి త్రాగునీటి కష్టాలు అనుభవిస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక కమిటీ సభ్యులు పర్యటించి గిరిజనులు సమస్యలను తెలుసుకున్నారు. జన్నీ సంజీవ్ రావు, కార్యదర్శి జే గోపాల్ రావు, ఉపాధ్యక్షులు అల్తి అప్పలస్వామి సంఘ సభ్యులు ఐటీడీఏ పీవో దృష్టిలోకి సమస్యలను తీసుకెళ్తామని అన్నారు.