రాజాం నియోజకవర్గం లోని రేగిడి ఆమదాలవలస మండలంలో అక్రమంగా టేకు, మామిడి, నీలగిరి కలప తరలిపోతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. రాజాం, రేగిడి లోని కొన్ని టింబర్ డిపోలు ఈ అక్రమ రవాణా అధికారుల కళ్లుగప్పి పాల్పడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. పాలకొండ. రాజాం ప్రధాన రహదారిలో ట్రాక్టర్లతో అక్రమంగా కలప రవాణా యథేచ్ఛగా తరలిస్తున్నారు. టేకు, చందనం కలప రవాణా ఎగుమతులు చేపడితే సంబంధిత రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ టింబర్ డిపోలు నిర్వహిస్తున్న నిర్వాహకులు అక్రమంగా అత్యంత విలువైన టేకు కలపను ట్రాక్టర్లతో తీసుకు వెళ్లడం చూస్తున్న స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న విలువైన కలప అక్రమ రవాణాను నిరోధించాలని పలువురు కోరుతున్నారు.