విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పరారైన సంఘటన గురువారం అయ్యకోనేరు సమీపంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి టూటౌన్ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. అయ్యకోనేరు గట్టు పరిసర ప్రాంతంలో ఉన్న మెడికల్ షాపులో పనిచేస్తున్న గొర్లె వాణి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా. వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై అతివేగంతో వచ్చి మెడలో ఉన్న సుమారు రెండు తులాల పుస్తెలతాడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టూటౌన్ ఏఎస్సై పైడితల్లి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.