ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యం ఇస్తున్నారని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని మెకానిక్ టెంపుల్ ఆవరణలో శ్రీ కళాదర్శిని చేనేత హస్తకళ మేళ ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకే చోట పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేనేత వస్త్ర ప్రదర్శన, హస్తకళ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నాణ్యతతో కూడిన వస్త్రాలను తక్కువ ధరలకే విక్రయించడం గొప్ప విషయం అని అన్నారు. ప్రతి ఒక్కరు చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు.