బొబ్బిలి మండలం, పిరిడి గ్రామం అక్రమంగా, ప్రభుత్వ అనుమతులు లేని మద్యం అమ్ముతున్నట్లు రాబడిన సమాచారం మేరకు, బొబ్బిలి పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నాగేశ్వర రావు ఆదేశాల ప్రకారం, ఎస్సై సి. హెచ్ సూర్యనారాయణ, వారి సిబ్బంది తో వెళ్లగా, అదే గ్రామానికి చెందిన ఉండ్రాళ్ళ శ్రీనివాసరావు అనే వ్యక్తి సుమారు 2, 700 విలువ గల 18 మద్యం సీసాలు తన షాప్ లో ఉండగా పట్టుబడ్డాడు. తదనంతరం, సదరు మద్యం బాటిళ్లు సీజ్ చేసి ముద్దాయిని అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించి, అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది.