ప్రభుత్వం నిర్వహిస్తున్న పూరి సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు కోరారు. పైలెట్ ప్రాజెక్టు కింద భూసర్వే చేస్తున్న గ్రామాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న చిన్న భూ సమస్యలు ఉంటే గ్రామసభల ద్వారా పరిష్కరించుకోవాలి అన్నారు. భూ రీసర్వేతో సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చన్నారు.