పాయకరావుపేటలోని లింగాలతోట కాలనీకి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్ ఐ పొన్నాడ ప్రసాద్ తెలిపారు. పోలీసులు అదించిన వివరాల ప్రకారం దేవాది వరహాలు ఎంబిఎ పూర్తిచేసాడు. ఇటీవల జరిగిన కాంఫటేటివ్ పరీక్షలు వ్రాయగా ఫెయిలు కావడంతో మనస్ధాపానికి గురై పెద్దెరు బీచ్ లో పురుగుల మందు సేవించి తన స్నేహితులకు పోన్ ద్వారా సమాచారం అందించాడు. విషయం తెలిసుకున్న బందువులు, స్నేహితులు బీచ్ కు వెళ్ళగా అప్పటికే అపస్మారక స్ధితిలో ఉన్న వరహాలను తుని ఆసుపత్రిలో చేర్చారు అక్కడ నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ ఐ తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.