జంగారెడ్డిగూడెం, పట్టణంలోని స్థానిక 1వ వార్డులో శనివారం గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే ఎలిజా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ప్రజల సమస్యలను ఎమ్మెల్యే వివరంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.