క్యాన్సర్ కు దారితీసే పొగాకు ఉత్పత్తుల్ని వాడొద్దంటూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నామన్నారు. హోమీబాబా క్యాన్సర్ పరిశోధనా కేంద్రం, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన వాక్ థాన్ లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక సహకారం కోసం హోమీబాబా క్యాన్సర్ పరిశోధనా సంస్థ తో ఎంవోయూ చేస్తున్నామని తెలిపారు. నాలుగైదేళ్లలో ఏపీలో క్యాన్సర్ చికిత్స కు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ ను అందుబాటులో కి తేవాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయం అన్నారు. కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ లో ప్రివెన్షన్ , డయగ్నోసిస్ , ట్రీట్మెంట్, ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 70 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, దాదాపు 35 వేల మంది వరకూ చనిపోతున్నారు. 25శాతం మంది పొగాకు ఉత్పత్తుల్ని వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. క్యాన్సర్ చికిత్స కు ఆరోగ్య శ్రీ కింద దాదాపు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని, క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నామన్నారు.
"పొగాకు ఉత్పత్తులు వాడొద్దు-క్యాన్సర్ బారిన పడొద్దు"జీవన శైలి లో మార్పులు తీసుకురావడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా బయటపడొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయ లక్ష్మి, హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు, మెడికల్, మున్సిపల్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.