నవోదయ తొమ్మిదవ తరగతి ప్రవేశ పరీక్ష లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం లో నిలిచిన గురుస్తాన్ కోచింగ్ సెంటర్ విద్యార్థి కె. ముకుంద ను రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభినందించారు. జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన విద్యార్థి మంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. రానున్న విద్య సమయంలో మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు.