కోనసీమలో ప్రతి రైతుకు ధాన్యం డబ్బులు చెల్లించామని అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీని సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్నామని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు తగ్గిపోయాయని చెప్పారు. అధికారం కోల్పోయాకే చంద్రబాబుకు రైతులు గుర్తొస్తారని మండిపడ్డారు. మద్దతు ధర ప్రకటించే ది, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వమే కదా అన్నారు. కూలీల రేట్లు, ధరలు పెరుగుతుండటంతో వ్యవసాయంపై రైతుకు ఆదాయం తగ్గుతుందన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని మనం నిలదీయాల్సి ఉందన్నారు. కేంద్రాన్ని ఏమీ అనకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై వ విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రంలో ఇన్‌పుట్ సబ్సిడీ, రైతులకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు కల్పిస్తున్నామని ఎంవీఎస్ నాగిరెడ్డి వివరించారు. ప్రతిపక్షం బాధ్యతగా నడవాల్సింది పోయి భాష కూడా హీనంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ అధికార ంలోకి వచ్చాకే వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయని ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు.