మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా కి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బంపరాఫర్ ఇచ్చారు. 127 కేజీల బరువు ఉండే అనిల్ 15కేజీల బరువు తగ్గితే అతని నియోజకవర్గానికి రూ.15,000 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. దీంతో ఎంపీ అనిల్ జిమ్లో వర్కవుట్లు చేసి 15 కేజీలు తగ్గారు. తాను బరువు తగ్గినట్లు పార్లమెంట్ సమావేశాల్లో గడ్కరీకి చెబుతానని, తమకు నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు ఎంపీ చెప్పారు.