ప్రతి గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అందరికీ తెలుసు. అయితే రోజు ఎక్కువ గుడ్లు తినడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా..? అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. గుడ్లు తినడంవల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కానీ ఎక్కువ గుడ్లు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు. జిమ్ లకు వెళ్లే వాళ్లు, శరీర దారుఢ్యాన్నిపెంచే వాళ్లు ఎక్కువ గుడ్లు తింటుంటారు. అలాంటి వాళ్లు రోజుకు 4 నుంచి 5 గుడ్లను తింటుంటారు.
గుడ్డులోని తెల్ల సొన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు తెల్ల సొన తినడం వలన ఉపయోగం ఉంటుంది. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు వస్తాయని, అంతేకాకుండా కిడ్నీలో సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. దీన్ని పట్టించుకోకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గుడ్డులో విటమిన్ ఏ, బి12, డి, ఈ, ఒమేగా 3 వంటి పోషకాలు లభిస్తాయి. అయితే రోజుకు 2 గుడ్లు తింటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.