నూతన భారతావని సాధనలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణాన్ని అత్యంత వేగంగా నిర్వహిస్తోంది . అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది&నిర్మిస్తోంది. కాణిపాకం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల మీదుగా చిత్తూరు నుండి మల్లవరం వరకు నిర్మిస్తున్న NH-140, 6 వరుసల జాతీయ రహదారిలోని మిగిలిన పనులను నేషనల్ అధారిటీ అఫ్ ఇండియా శరవేగంగా చేపడుతోంది. ఈ పూర్తి రహదారి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పరంగా, వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తుంది. ఏపీ అభివృద్ధిపై అత్యంత శ్రద్ధ చూపుతున్న ప్రధానమంత్రి గారికి,మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున బీజేపీ నాయకులూ విష్ణు వర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసారు.