తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. సమ్మర్ హాలిడేస్, వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు రాంభగీచ వరకు చేరుకున్నాయి. నడక మార్గం ద్వారా భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.