మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్లో 16 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తమ స్నేహితుడికి లైమ్ స్ట్రీమింగ్ పెట్టారు. బాలిక ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్ లో పోస్టు చేశారు. జూన్ 2న ఘటన జరగ్గా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.