ఆదివారం నాడు కనిగిరి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి గ్రౌండ్ నందు జరుగుతున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. కంటి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు రోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రోగులకుఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాటు చేసినారు. వచ్చిన రోగులకు భోజన ఏర్పాట్లు చేశారు.