ఏ ధర్మమైన , ఏ మతమైనా కానీ ప్రతి దేవుడికి భక్తులు అనేది సహజంగా ఉంటారు , వారే వారి దేవుని పూజలు ,ఉత్సవాలు జరుపుతుంటారు . అలాగే ఇప్పుడు ఎక్కువగా పూజించే ఒక దేవుని గురించి తెలుసుకుందాం . ఎవరా అనుకుంటున్నారా ఆయన ఎవరో కాదు ఏకపత్ని వ్రతుడు , దశరధ మహారాజ్ కుమారుడు , విష్ణు మూర్తి అవతారుడు ఐన శ్రీరాముడు . అదేంటి శ్రీరామునికి భక్తులు లేరా అనుకుంటున్నారా ,వినండి కొంచెం ఈ భూమి మీద హిందూ మతాన్ని ఆచరించే ప్రజలలో ఎక్కువ మంది రాముని పూజిస్తారు అలాగే ఆడవారు ఐతే అసలు చెప్పేపనిలేదు , శ్రీరాముని లాంటి వాడు తనకి భర్త గా రావాలని ఎన్నో పూజలు పురష్కారాలు సెయ్యడం చూస్తూనేఉన్నాం . కానీ శ్రీరామునికి ప్రధమ భక్తుడు , రాముని అత్యంత ప్రీతీ పాత్రుడు మాత్రం హనుమంతుడు మాత్రమే , అవునా కాదా ? హా అవును అనక తప్పదు . హనుమంతుడు లేని రామాయణం ని చూడగలమా ..... ? అందుకోసమే ప్రతి రాముడు గుడిలో హనుమంతుని విగ్రహం కూడా పెట్టి రామునితో పాటుగా హనుమంతునికి పూజలు చెయ్యడం చూస్తున్నాం.
కానీ హనుమంతుడు విగ్రహం లేని రామాలయం కూడా ఉంది అంతే నమ్మక తప్పదు , అది కూడా ఎక్కడో కాదు మన తెలుగు రాష్టాలలో ఒక్కటైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము , కడప జిల్లా, ఒంటిమిట్ట ప్రాంతంలో కొలువైయున్న శ్రీ కోదండరామ స్వామి ఆలయం. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో రూపొందించిన కారణంగా ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ఆలయమున్న ఒంటిమిట్టను ఆంధ్రా భద్రాచలం గా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు.
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటారు. ఐతే ఈ సంఘటనలన్నీ రాముడు , హనుమంతుడిని కలవక మునుపే జరిగి ఈ ఆలయం నిర్మించడం జరిగింది . అందువల్ల ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం ఉండదు .
ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది . పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు.ఒంటిమిట్ట నివాసి, ఆంధ్రవాల్మీకి అని పేరొందిన వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి. శ్రీ కోదండరామ స్వామి ఆలయం రామతీర్ధం మరియు లక్షనతీర్ధం వంటి ఇద్దరి నిత్యం కొలనులు ఉన్నాయి. పురాణ నుంచి కొన్ని సంఘటనలకు రామాయణం మరియు మహాభారతం ఈ ఆలయం లోపల కళా రూపంలో అత్యంత అద్భుతంగా చేశారు.