మనిషి అందం విషయంలో ముఖానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో , అందరికి తెలిసిందే కానీ అలాంటి ముఖం కొంచెం కాంతి తగ్గితేనే తట్టుకోలేము అలాంటిది ఇంకా ముఖం మీద పాచెస్ లాగ మచ్చలు వస్తే ....? వామ్మో ఇంకా ఏమైనా ఉందా . ఆలోచించడానికి భయంగా ఉంది కదా ... మనం ఎన్ని జాగర్తలు తీసుకున్న మనం తినే ఆహారపు అలవాట్ల వలన కానీ , వాతావరణ ప్రభావం వలన కానీ , కొన్ని ఆరోగ్య సమస్యల వలన కానీ ఇవి రావడానికి అవకాశం ఉంది . మెలనిన్ అనే పదార్థ లోపం వలన ఇవి ఆవిర్భవిస్తాయి . చర్మ కణాల్లోని మెలనోసైట్స్ మెలనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మానికి రంగునిస్తుంది. అయితే ఇది చర్మంపై అక్కడక్కడా మరీ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. చర్మంపై అక్కడక్కడా ఏర్పడే నల్ల మచ్చల్ని హైపర్ పిగ్మెంటేషన్ (మంగు మచ్చలు) అంటారు.
మనకు ఉన్న ఆరోగ్య సమస్యల వలన మనం కొంత మెడిసిన్ వాడవలసి వస్తుంది . ఆ మందుల ప్రభావం అనేది మన శరీరం పైన పనిచేసి ఈ రకమైన మచ్చలు రావడానికి అవకాశం ఉంది . ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల విషయంలో వారు వాడే మందుల వలన వలన ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది .
అలర్జీ , సోరియాసిస్ , మరియు చర్మ సంబంధమైన సమస్యలకు వాడే మందుల ప్రభావం వలన కూడా ఈ సమస్య తలెత్తుతుంది . అలానే మెడిసిన్ వలన కాకుండా విధి వైపరీత్యాల వలన అనగా చర్మం కాలడం , accidental గాయాలు వలన ఏర్పడే గాయాలు తగ్గిన తర్వాత నల్లని మచ్చలుగా మారడానికి అవకాశం ఉంది .
అలాగే మనం మన సౌదర్యం పెరుగుదల కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మన చర్మం మీద వాడుతూనే ఉంటాము అలంటి వారిలో కూడా ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది .
వాతావరణంలో ఎండ ఎక్కువగా ఉన్నపుడు బయట ఎక్కువగా తిరగడం , ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోవడం , మసాలాలూ ఎక్కువగా తినడం వలన కూడా ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది . గర్భిణీ శ్రీలలో హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గుల అవ్వడం వలన మెలనిన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది కూడా పిగ్మెంటేషన్‌కి కారణమవుతుంది.
జాగర్తలు :
సమస్య ఏదేనా , రాక మునుపే మనం జాగర్త తీసుకోవడం మంచిది కానీ అది అన్ని వేళల్లో సాధ్యం కాదు కాబట్టి , సూర్యరశ్మి ముఖంపై పడకుండా తగిన జాగర్తలు తీసుకోవాలి అలగే సన్‌స్క్రీన్ లాంటి చర్మ సంబంధిత క్రీమ్స్ రాసుకోవడం మంచిది .
కొన్ని చర్మానికి త్వరగా కాంతిని ఇవ్వడానికి , అందంగా కనపడానికి ఎక్కువ డోస్ కలిగిన మందులు వాడటం మంచిది కాదు . దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మొత్తం చర్మం పాడైయ్యా అవకాశం ఉంది అని గమనించాలి
నివారణ చర్యలు :
హైపర్ పిగ్మెంటేషన్(మంగు మచ్చలు) ఈ సమస్య నుంచి బయటపడాలంటే మనకు అందుబాటులో ఉన్న చిట్కాలు
యాపిల్ వెనిగర్, నీళ్లు , సమానంగా తీసుకొని ఈ మిశ్రమాన్ని మెత్తటి దూదితో నల్ల మచ్చలున్న చోట మర్దన చెయ్యాలి . రెండు మూడు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే సమస్య తగ్గుముఖం పడుతుంది.
కలబంద వాడటం వలన ఈ సమస్య తగ్గడమే కాకుండా , చర్మం కూడా చాల కాంతివంతంగా తయారవుతుంది . కలబంద గుజ్జుని ఆ మచ్చలపై రుద్ది , తర్వాత ఆ గుజ్జుని ముఖం మొత్తం ఒక ప్యాక్ లా వేసుకొని ఒక అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో కడగటం లేదా స్నానం చెయ్యడం వలన మంచి ఫలితం పొందవచ్చు .
గ్రీన్ టీ తాగడం వలన చర్మ సమస్యలు రాకుండా ఆపవచ్చు అలాగే వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్‌ను మచ్చలపై కాసేపు రుద్దడం వల్ల కూడా సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
అయితే ఇలాంటి ప్రయత్నాలు చేసినా నల్ల మచ్చలు తగ్గకపోతే లేదా సమస్య ఎక్కువగా ఉన్నా తగిన వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.