రేపల్లె మూడో వార్డు లోని సచివాలయాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారని ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందించే సేవల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే వాటికి పరిష్కారం చూపించాలని ఎంపీ మోపిదేవి ఆదేశించారు.