స్లామిక్ శక్తుల నుంచి తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ జిందాల్ వెల్లడించారు. ఇదిలావుంటే ప్రవక్తపై వ్యాఖ్యల నేపథయంలో నవీన్ జిందాల్ ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వర్గం నుంచి తన కుటుంబానికి హాని ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయవద్దని కోరారు. తన గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ ఎవరూ కూడా ఎలాంటి వివరాలను ఎవరికీ చెప్పవద్దని విన్నవించారు. తన నివాస చిరునామాను చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారని చెప్పారు.