ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవాలంటే గ్రామాల అభివృద్ధి తప్పనిసరి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.గ్రామాలు అభివృద్ధి చెందకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని నా దృఢ విశ్వాసం, గ్రామాలు సుభిక్షంగా, స్వావలంబనతో, మంచి సౌకర్యాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, కల సాకారం కావడానికి దోహదపడుతుందని అన్నారు.