వేగంగా వస్తున్న కారు ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయా లైన ఘటన చేబ్రోలులో చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో జీబీసీ రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయాలైన వారిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.