అరటి పండు చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పండును తినడం చాలా సులభం. ఇతర పండ్లలో లాగా మధ్యలో విత్తనాలు ఏమీ ఉండవు. అందువల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే ఈ పండు రాత్రివేళ తినవచ్చా అనేది చాలా మందికి ఉన్న సందేహం. మరి నిపుణులు ఏమంటున్నారో చూద్దామా..
*రాత్రివేళ అరటిపండు తింటే దగ్గు, జలుబు వస్తుంది.
*అర్థరాత్రి తప్ప మరే సమయంలోనైనా అరటిపండ్లు తినవచ్చని సూచిస్తున్నారు.
*జలుబు, దగ్గు ఉన్నవారు అరటిపండు జోలికి వెళ్లకపోవడం మంచిది.
*అరటి పండు శరీరానికి చలువ చేస్తుంది. ఫలితంగా దగ్గు, జలుబు మరింత పెరిగే అవకాశం ఉంది.
*ఒక అరటిపండు జీర్ణం అవడానికి 3 గంటలు పడుతుంది. అందువల్ల నిద్రకు 3 గంటల ముందు వరకే అరటి పండు తీసుకుంటే బెటర్.