తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈనెల 14 న విత్తన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో విత్తనోత్పత్తి, ఇతర ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయిన విత్తన రకాల ప్రదర్శన, అమ్మకం ఉంటుందని వివరించారు.