రైతాంగ సమస్యలపై అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను టీడీపీ యత్నించడం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అయతే కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ద్విచక్ర వాహనంలో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ నేత రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులకు, ఆయనకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే చివరకు కాల్వ శ్రీనివాసులు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో వారు కలెక్టర్‌కు వినతితప్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ పీనల్ కోడ్ అమలు అవుతుందని మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుపుతున్నారని విమర్శించారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. రైతు సమస్యల గురించి ప్రస్తావిస్తే.. నిర్బంధ వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
‘‘టీడీపీ చేపట్టిన "చలో కలెక్టరేట్" కు అడుగుడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పుట్టపర్తిలో కలెక్టరేట్ ముట్టడికి వెళుతున్న మమ్మల్ని రామగిరిలో పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేమైనా నియంత రాజ్యమా.. ప్రజాస్వామ్య రాజ్యమా?. పోలీసులు వైసీపీకి పనిచేయడం మానేసి ప్రజల కోసం పనిచేయాలి’’ అని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.
పరిటాల శ్రీరామ్ pic.twitter.com/Xlk6oG9Sq9
— Suresh Budipiti (@budipiti_suresh) June 13, 2022