ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీలో పెరుగుతున్న అఘాయిత్యాలు...మరో డిజిటల్ రేప్ కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 02:31 AM

యూపీలో మహిళలపై, బాలికలపై అరాచకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపడంలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్‌లో ఓ డిజిటల్ రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. బులంద్‌షహర్‌లోని ఖుర్జా దేహత్ గ్రామంలో ఓ బాలిక డిజిటల్ అత్యాచారానికి గురైంది. వీధిలో ఆడుకుంటున్న సమయంలో బాలికపై.. 17 ఏళ్ల బాలుడు డిజిటల్ రేప్‌కు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


బాలిక పొరుగింట్లోనే నిందితుడు ఉండేవాడు. పాపకు ఆహారం పెడతాననే సాకుతో ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడేవాడు. ఇది తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు వెంటనే ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కూడా వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


డిజిటల్ రేప్ అంటే ఇంటర్నెట్‌‌తో ఎటువంటి సంబంధం లేదు. అయితే డిజిట్ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఇంగ్లీష్ డిక్షనరీల శరీర భాగాలకు కూడా నెంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్, రేప్ కలిపి డిజిటల్ రేప్ అని పేరు పెట్టారు. డిజిటల్ రేప్ అంటే మహిళలు లేదా బాలికల ప్రైవేట్ భాగాల్లోకి చేతి వేళ్లు లేదా కాలి వేళ్లను, వస్తువులను బలవంతంగా చొప్పించడాన్ని డిజిటల్ రేప్ అంటారు.


ఇదిలావుంటే  గత మే నెలలో కూడా యూపీలో ఇలాంటి కేసు నమోదైంది. నొయిడాలో 17 ఏళ్ల బాలికపై 81 ఏళ్ల మారిస్ రైడర్ అనే వ్యక్తి డిజిటల్ రేప్‌కు పాల్పడ్డాడు. స్కెచ్ ఆర్టిస్ట్‌గా పనిచేసే మారిస్.. ఏడేళ్లకుపైగా ఆ అమ్మాయిపై డిజిటల్ రేప్‌కు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ నేరానికి పాల్పడినందుకు నిందితుడు‌పై సెక్షన్ 376, 323, 506ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com