కర్ణాటకలోని ఉళ్లాలలోని ఓ స్కూల్ హాస్టల్లో శనివారం అర్ధరాత్రి పూర్వజ్(14) అనే బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. తన తల్లి మంజుల బర్త్ డే కి విషెస్ చెప్పడానికి వార్డెన్ ఫోన్ ఇవ్వకపోవడంతో సూసైడ్ నోట్ రాసి హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. ''అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతేసి ఫీజులు కట్టి నన్ను దుఃఖంలో పడేశారు. నాకోసం కట్టిన ఫీజు వెనక్కి తీసుకోండి' అని బాలుడు రాసిన డెత్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది.