కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ నాయకుల పై ఈడి కేసులు పెట్టి అక్రమం గా పెట్టిన కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి మస్తాన్ ఖాన్ అన్నారు. నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరి వెంటనే మానుకోవాలని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పై నేషనల్ హెరాల్డ్ కేసు కు సంబందించి ఇడి ఎదుట హాజరు కావాలని ప్రభుత్వం(బిజెపి ) కాంగ్రెస్ నాయకులు పై గతంలో కోర్టు లు కేసులు అన్నియు కొట్టి వేయడం జరిగింది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కేసు ను తిరుగితోడి అక్రమంగా ఈడీ కేసులు పెట్టడం జరిగిందని అందుకు నిరసనగా డిల్లీ లో ఏఐసీసీ కార్యాలయం నుండి ఆఫీస్ వరకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నాయకులు నడుచుకుంటూ నిర్వహించడం జరిగింది.