ఈ నెల 26 న గుత్తిలో జరిగే జాతీయ లోక్ అదాలత్ లో దీర్ఘకాలంగా పరిష్కారం కానీ కేసులను పరిష్కరించుకోవాలని గుత్తి ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి కబర్డి, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జ్ లు తేజోవతి, దీప్తి లు పేర్కొన్నారు. సోమవారం పట్టణం లోని ఎడిజే కోర్టులో గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాల పోలీసులు, రెవెన్యూ, పారా లీగల్ వలంటీర్, బ్యాంకు అధికారులతో ఎడిజే సమావేశం నిర్వహించారు. కోర్టు లలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ కేసులను ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి పరిష్కారం చూపాలని ఎడిజే పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ లు శ్యామరావు, ఈరన్న, సెబ్ సిఐ వరలక్ష్మీ, పీపీ బుసా సుదర్శన్ రెడ్డి, న్యాయ వాదులు పాల్గొన్నారు.