నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వ్యాపారులను హెచ్చరించారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలోని బీరప్ప కూడలిలో జరుగు తున్న పారిశుద్ధ్య పనులను కమీషనర్ పరిశీలించారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో కిరాణా దుకాణాలలో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల ను తనిఖీలు నిర్వహించారు. ఓ కిరాణా దుకాణంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లను గుర్తించి మరోసారి దుకాణంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తే లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని వ్యాపారిని హెచ్చరించారు. ఆయనతో పాటు సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శి ఉన్నారు.