పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 14 నుండి 18 వరకు సిపిఎం నాయకులు రెండు బృందాలుగా ఏర్పడి ప్రజాసమస్యలపై సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకార్యదర్శివర్గసభ్యులు పెద్దన్న , మండల కార్యదర్శి రాజగోపాల్ , సభ్యులు హనుమయ్య , వెంకటేశ్ , చాంద్ బాషా , గంగరాజు , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.