విడపనకల్లు మండలం పాల్తూరులో పలువురు రైతులు నకిలీ వేరుశెనగ విత్తనాలతో నట్టేట మునిగారు. ఎకరాకు 50 బస్తాలు (25 క్వింటాళ్ల) దిగుబడి వస్తుందని కంపెనీ ప్రతినిధి చెప్పిన మాటలు నమ్మి నాసిక్ కు చెందిన భూమి అగ్రి జెనిటీక్స్ కు చెందిన ట్యాగ్ 24 రకం విత్తనకాయలను క్వింటాల్ 14, 500 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి పంట సాగు చేసే పంట ఏపుగా పెరిగినా కోత సమయానికి చెట్టుకు ఒకటి రెండు కాయలు కూడా లేవని బాధిత రైతులు 14 ఎకరాల్లో పంట సాగు చేసిన గోవిందరాజులు, 4 ఎకరాల్లో సాగు చేసిన అంజినయ్య, 6 ఎకరాల్లో సాగు చేసిన వన్నూర్ సాబ్, 10 ఎకరాల్లో సాగు చేసిన మారేయ్య తదితరులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, బావుల క్రింద పంట సాగు చేయడానికి ఎకరాలకు లక్ష రూపాయల వరకు ఖర్చు అయిందని దిగుబడి మాట అటుంచితే పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. చెట్టుకు కాయలు మోలవలేదని రైతులు అవేదన వ్యక్తం చేశారు.