తొండూరు మండల పరిధిలోని గుండ్లమడుగు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్ఐ హనుమంతు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఖాళీ ప్రదేశాలు, కల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అసాంఘిక చర్యలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రశాంతంగా జీవించాలని సూచించారు.