తమిళనాడులోని కుంభకోణంలో ఓ జంట పరువుహత్యకు గురైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటను యువతి కుటుంబసభ్యులు దారుణంగా చంపారు. మోహన్(31), శరణ్య(25) గతవారమే చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని శరణ్య సోదరుడు శక్తివేల్ రిసెప్షన్ పేరుతో నూతన జంటను ఇంటికి రప్పించాడు. శక్తివేల్, శరణ్య బావ రంజిత్ ఇద్దరు కలిసి శరణ్య, మోహన్ ను వెంటాడి దాడి చేసి చంపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa