కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాటుసారా ప్రభావిత గ్రామాలైన టీ కోడూరు చామలూరు గ్రామాలలో మంగళవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ సుదర్శన్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామాల్లోని అనుమానిత ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని గ్రామస్తులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గణ మద్దిలేటి పాల్గొన్నారు.