ఏపీలో కోనసీమ జిల్లాకు పేరు మార్పుపై తలెత్తిన అల్లర్లలో దుండగులు మంత్రి విశ్వరూప్ ఇంటిని తగులబెట్టారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. నిందితులలో మంత్రి అనుచరులు వాసంశెట్టి సుభాష్, సత్యరుషి, మట్టపర్తి మురళీకృష్ణ, రఘు ఉన్నారు. వీరు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 258 మందిపై కేసు నమోదవగా, 142 మంది అరెస్టయ్యారన్నారు.