రైతులు ఆరుగాలంశ్రమించి పండించిన పంట చేతికొచ్చేలోగా ఏదైన ప్రకృతి విపత్తుతో నష్టపోతే రైతులపై ఆర్థికభారం తగ్గించేందుకు, రైతులకు అండగా ఉండేందుకు డాక్టర్ వైయస్‌ఆర్ ఉచిత పంటల బీమాపథకాన్ని సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. గతంలో పంటలకు బీమా చేయించుకోవడం కష్టతరంగా ఉండేది. కార్యాలయాల చుట్టూ తిరిగి నష్టపోయేవారు. ప్రస్తుతం అలాంటి కష్టాలు లేవు. ఈ–క్రాప్ నమోదు చేయించుకుంటే చాలు పంట నష్టపరిహారం అందించే విధంగా సీఎం ఆలోచన చేసి ఈ రోజు వైయస్‌ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ నమోదు చేసుకుంటే బీమా రక్షణ కల్పిస్తూ పరిహారం అందిస్తున్నాం. గతంలో టీడీపీ హాయంలో ఉన్న బకాయిలు చెల్లిస్తూ..రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక్క విడతలోనే రూ. 2,977.82 కోట్లు ఈ రోజు వైయస్ జగన్ చేతుల మీదుగా ఉచిత పంటల బీమా పథకం కింద అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. సీఎం వైయస్ జగన్ ఇందుకోసం నిర్ధిష్టమైన సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి నియమ నిబంధనలు అనుసరించి పరిహారం ఇవ్వాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఇప్పటికే వైయస్‌ఆర్ రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు ఇచ్చాం. సున్నా వడ్డీకి సంబంధించి పంట రుణాలు ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు తోడుగా నిలుస్తున్నాం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేసి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం అని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.