ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెరిసిపోయే మేనిఛాయకు రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముందు ఈ జ్యూస్ తాగండి

Recipes |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 10:08 PM

తమ ముఖం అద్దంలా తళ తళ మెరిసిపోవాలని, చిన్న మచ్చ కూడా ఉండకూడదని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. అందుకోసం చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను, వేలు ధారపోసి మరీ కొంటుంటారు. వాటి ఫలితం మాట అటుంచితే, ఒకవేళ అవి మన శరీరానికి పడకపోతే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడాల్సి ఉంటుంది. అందుకోసం ఇంటిలోనే తయారుచేసుకునే నాచురల్ గ్లోయింగ్ డ్రింక్ బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఈ డ్రింక్ ను తాగితే మిలమిల మెరిసే మేను మీ సొంతమవుతుంది. 


క్యారెట్, బీట్ రూట్ లను నీటితో శుభ్రంగా కడిగి, పై తోలు తీసి చిన్న ముక్కలుగా కోసి ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఆ ముక్కలకు కొన్ని టమాటో ముక్కలను, గుప్పెడు పుదీనా ఆకులను జోడించి, మరో కప్ నీటిని పోసి మెత్తని మిశ్రమంలా మిక్సీ పట్టుకోండి. ఈ మిశ్రమాన్ని వడకట్టి వచ్చిన జ్యూస్ ను నిమ్మకాయ పిండి తాగండి. ఇలా రోజూ చేస్తే, మీ శరీరం మెరిసిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com