రూపంలో క్యాలీ ఫ్లవర్ ను తలపించే బ్రకోలి అన్ని సూపర్ మార్కెట్లలోనూ దొరుకుతుంది. గ్రీన్ వెజిటేబుల్స్ లో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండే అత్యంత ఆరోగ్యవంతమైన వెజిటేబుల్ బ్రకోలి. ఇతర కూరగాయల వలె దీనిని కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. బ్రకోలి వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో బ్రీఫ్ లుక్ వేద్దామా!
-- బ్రొకలీని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుడుతుంది.
-- వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
-- దీనిని తరచూ తింటూ ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
-- బ్రొకొలిలో కరిగే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.
-- ఒక నేచురల్ డిటాక్స్ ఫుడ్. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది .
-- బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను క్రమబద్దం చేసే టాప్ ఆహారాల్లో బ్రొకోలి ఒకటి.