కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు, బియ్యప్పిండి - 1 కప్, బొంబాయి రవ్వ - అరకప్, బెల్లం తరుగు - 1 కప్, యాలకుల పొడి - అర స్పూన్, వంటసోడా - చిటికెడు, నూనె.
తయారీవిధానం:
--- ఒక గంటపాటు నానబెట్టిన మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి మెత్తగా, గారెల పిండిలా రుబ్బుకోవాలి.
--- ఇలా రుబ్బుకున్న పిండిలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, చిటికెడు వంటసోడా వేసి బాగా కలపాలి.
--- ఇప్పుడొక గిన్నె లో బెల్లం తరుగు, పావు కప్ నీళ్లు, యాలకుల పొడి వేసుకుని పొయ్యి మీద పెట్టాలి.
--- బెల్లం పూర్తిగా కరిగి తీగ పాకంలా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
--- ఇప్పడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టి గారెలు వేయించేందుకు సరిపడా నూనె పోసుకోవాలి.
--- నూనె బాగా కాగాక మొక్కజొన్న పిండిని గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి.
--- ఆ తర్వాత ఈ గారెలను, ఇందాక తయారు చేసి పెట్టుకున్న బెల్లంపాకంలో వేస్తే సరి.... రుచికరమైన మొక్కజొన్న పాకం గారెలు రెడీ.