బనగానపల్లె మండలంలోని గులాంనబీపేట సమీపంలోని నట్లకొత్తూరు రహదారి వద్దనున్న గోదాము నమీపంలో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో సంజామల మండలం ఆకుమళ్ళకు చెందిన దుబ్బా రఘునాథరెడ్డి (48) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ రామిరెడ్డి మంగళవారం తెలిపారు. రఘునాథరెడ్డి టంగుటూరు గ్రామంలో పని ముగించుకొని గులాంనబీ పేట, నట్లకొత్తూరు మీదుగా స్వగ్రామం ఆకుమళ్లకు బైక్పై వెళ్తుండగా ఎదురుగా బైక్పై వస్తున్న అదే గ్రామానికి చెందిన ఖాశీంవలి పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో రఘునాథరరెడ్డికి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఖాశీంవలికి కూడా తీవ్రగాయాలు కావడంతో బనగానపల్లె ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.