వెల్దుర్తి మండలం రామళ్లకోటలో బుధవారం తెల్లవారుజామున నుండి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారితో పాటు గ్రామంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారి మొత్తం వరద నీరు చేరడంతో బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు చీకట్లో అల్లాడిపోయారు. సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం కారణంగా గ్రామం మొత్తం వరద నీరు చేరింది.