ఆత్మకూరు మండలంలో బుధవారం నుంచి సమగ్ర భూ సర్వే ప్రారంభిస్తున్నట్లు ఆర్డిఓ దాసు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు మండలంలో ఎంపిక చేయబడిన మూడు గ్రామాల్లో సమగ్ర సర్వే ద్వారా పూర్తిస్థాయిలో భూమిని సర్వే చేసి డిజిటలైజేషన్ ప్రక్రియలో సర్వే వివరాలు నమోదు చేయనున్నట్లు వివరించారు. మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఈ సర్వే మొదలు పెట్టనున్నట్లు వెల్లడించారు.