గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిన్న గొట్టిగల్లు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చిన్నగొట్టిగల్లు మండలంల చిట్టే చర్ల గ్రామ పంచాయతీ డెంకు చెందిన జ్యోతి ( 25 ) నాగరాజు ప్రేమించుకుని గత మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి రెండు సంవత్సరాల కుమార్తె ఉంది. ఇరువురు మంగళవారం తగువులాడుకున్నారు. భర్త నాగరాజు చౌకదుకాణం బండి వద్ద బియ్యం తీసుకుని రావటానికి వెళ్లగా నిప్పుంటుంచుకుందని కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు గమనించి మంటలార్పి చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయ ఆసుపత్రికి తరలించారు.